బిహార్​ ప్రతిపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొందని ఆరోపించారు. బిహార్​ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా నష్టపరిచిన చరిత్ర గల వారిని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు మోదీ.బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాసారమ్​ బైదా మైదానంలో నిర్వహించిన తన తొలి బహిరంగ సభలో ప్రసంగించారు ప్రధాని మోదీ. ముందుగా.. దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్​ పాసవాన్​, బాబు రఘువంశ్​ ప్రసాద్​ సింగ్​లకు నివాళులర్పించారు.


ఆర్టికల్​ 370ని విపక్షాలు పునరుద్ధరిస్తామని పేర్కొనటంపై తీవ్ర విమర్శలు చేశారు. దళారులు, మధ్యవర్తులను కాపాడేందుకే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.బిహార్​ ప్రజలు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా మహమ్మారిని సమర్థంగా కట్టడి చేయగలుగుతున్నారని పేర్కొంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. గాల్వాన్​ లోయలో మరణించిన బిహార్​ ముద్దుబిడ్డలు.. భారత మాత సగర్వంగా తలెత్తుకునేలా చేశారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: