బిహార్​లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర​ ప్రజలందరికీ కొవిడ్-19 వ్యాక్సిన్​ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది బిజేపి. వ్యాక్సిన్​ను ఉచితంగా అందిస్తామంటూ బిజేపి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనటంపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఓటు వేస్తేనే టీకా ఇస్తారా? అంటూ మండిపడ్డాయి. ఈ విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్.. విపక్షాల తీరును తప్పుబట్టారు. ఈ హామీలో ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టంచేశారు.


ఈ హామీని చారిత్రక అడుగుగా చెప్పుకొచ్చిన ఆయన.. బిజేపి విధానాలపై విమర్శలు చేసే నైతికత విపక్షాలకు లేదని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తే.. తప్పేంటని నిలదీశారు.బిహార్ వాసులకు ఉచిత వ్యాక్సిన్ వాగ్దానం ప్రజల ఆరోగ్యం పట్ల బిజేపి నిబద్ధతను తెలియజేస్తోందని చెప్పారు రవి శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: