భారత నావికాదళం శుక్రవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రబల్‌ నుంచి అరేబియా సముద్రంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.ఉపయోగంలో లేని ఓ నౌకను లక్ష్యంగా ఉంచారు. గరిష్ఠ దూరంలో ఉంచిన ఈ లక్ష్యాన్ని క్షిపణి అత్యంత కచ్చితత్వంతో చేరినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​ లో విడుదల చేశారు.



భారత్​ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా ఒడిశా తీరం నుంచి నిర్వహించిన స్టాండ్‌ ఆఫ్ యాంటీ ట్యాంక్ (ఎస్​ఏఎన్​టీ) క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ మేరకు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.భారత వైమానిక దళ వినియోగం కోసం ఈ క్షిపణిని భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేస్తోంది. లాక్‌ఆన్ ఆఫ్టర్ లాంచ్, లాక్‌ఆన్ బిఫోర్ లాంచ్ సామర్థ్యాన్ని ఈ క్షిపణి కలిగి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: