ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1990ల నాటి అరాచక పాలన కారణంగా బిహార్​ను ఇప్పటికీ సమస్యలు పీడిస్తున్నాయని ఆరోపించారు.గయాలో ఎన్డీఏ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఉందని, లాంతరు పట్టుకునే రోజులు పోయాయని ఆర్జేడీ ఎన్నికల గర్తును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ సహా వామపక్షాలు భాగస్వాములుగా ఉన్న మహాకూటమి నక్సలిజాన్ని పోత్సహిస్తుందని ధ్వజమెత్తారు మోదీ. వారి రాజకీయ అస్తిత్వం కోసం ప్రజల్ని ఎప్పుడూ పేదలుగా ఉంచాలనే ఆ పార్టీలు భావిస్తాయని ఆరోపించారు.జాతి వ్యతిరేక కార్యకలాపాలతో నిండిన బుట్ట వంటిదే మహాకూటమి. 1990ల నాటి అరాచక పాలన కారణంగా రాష్ట్రం ఇంకా సమస్యలు ఎదుర్కొంటోంది. వారి హయాంలో నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలకు తెలుసు.కొత్త కారు కొనుక్కోవాలన్నా ఎక్కడ తమను కిడ్నాప్ చేస్తారో అని ప్రజలు భయపడే వారు అని మోదీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: