కరోనా రోగి పట్ల కేరళలోని ఓ వైద్య సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొవిడ్​ సోకిన ఓ మహిళను మంచానికి కట్టేసి నిర్దయగా ప్రవర్తించారు. కలామస్సెరీ వైద్య కళాశాల ఆసుపత్రి వర్గాలు ఈ నిర్వాకానికి పాల్పడ్డాయని తెలుస్తోంది.కేరళ, త్రిస్సూర్​ జిల్లాలోని కదనగోడుకు చెందిన కుంజిబీవి అనే మహిళ కుటుంబానికి అక్టోబర్​ 18న కరోనా సోకింది. వారంతా కుట్టనెల్లూర్​లోని కొవిడ్​ ఆసుపత్రిలో చేరారు. అయితే, కుంజిబీవి ఆరోగ్య పరిస్థితి విషమించగా ఆమెను మెరుగైన చికిత్స కోసం కలామెస్సెరీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు.


కుంజిబీవికి తోడుగా వెళ్లేందుకు ఆసుపత్రి వర్గాలు తమను అనుమతించలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన కుంజిబీవి.. చాలా బలహీనంగా మారింది. ఆమెను అక్కడి వైద్య సిబ్బంది.. మంచానికి కట్టేసి ఉంచారు. మంచం మీద నుంచి లేచేందుకు ప్రయత్నించిన ఆమె.. కిందపడి తీవ్రంగా గాయపడింది. తలకు, కళ్లకు బలంగా దెబ్బలు తగిలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: