కరోనా సమయంలో హైదరాబాద్ పోలీసులు అనుసరిస్తున్న తీరుపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే విషయంలో హైదరాబాద్ పోలీసులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక బాలుడి విషయంలో హైదరాబాద్ పోలీసులు పెద్ద మనసు చాటుకున్నారు. మ‌తి స్థిమితం కోల్పోయి ర‌హ‌దారుల‌పై తిరుగుతున్న ఓ బాలున్ని మాదాపూర్ పోలీసులు చేర‌దీసి ఆదుకున్నారు.

మాదాపూర్‌ లోని ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్ వ‌ద్ద శుక్ర‌వారం ఆ బాలున్ని పోలీసులు గుర్తించి అత‌ని వివ‌రాలు క‌నుక్కునే ప్రయత్నం చేయగా బాలుడు మానసిక వ్యాధిగ్ర‌స్తుడు అయి ఉంటాడ‌ని, త‌న పేరు, చిరునామా, ఇత‌ర వివ‌రాల‌ను చెప్ప‌లేక‌పోతున్నాడ‌ని గ్రహించారు. బ‌హుశా అత‌ను ముస్లిం అయి ఉంటాడ‌ని  భావించిన పోలీసులు... అత‌న్ని ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ మేరకు అతనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: