దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 కే కిలో ఉల్లిగడ్డలుఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రైతు బజార్లలో విక్రయం ఉంటుందని పేర్కొంది. ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తారు.

ఏదైనా గుర్తింపు కార్డు చూయించడం తప్పనిసరి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ఉల్లిపంటతో ధరలు పెరిగాయి. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపట్టాలని ఆయన సూచించారు. మార్కెటింగ్ అధికారులను ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: