జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమా టీజర్ కి సంబంధించి ఇప్పుడు వివాదం రేగింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ టీజర్ లో కొమురం భీం పాత్రను వక్రీకరించారని  ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉట్నూర్ లో భీం విగ్రహం ఎదుట ఆదివాసీ సంఘాల నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని కొనియాడారు. మా వీరుడి పాత్రను  వక్రీకరించడమంటే.. మా మనోభావాలను దెబ్బతీయడమే అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మర్యాదగా ముస్లిం పాత్ర దారి సీన్లను మార్చేయాలి అని డిమాండ్ చేసారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఆదివాసీ నేత పెందోర్ ప్రభాకర్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: