దేశంలోని రైతులను అన్నదాతలుగా మాత్రమే కాకుండా విద్యుత్తు దాతలుగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్​లోని సౌర విద్యుత్​ కోసం ఉద్దేశించిన కిసాన్​ సూర్యోదయ యోజన సహా గిర్నార్​ పర్వత ప్రాంతంలో అతిపెద్ద రోప్​వే, అహ్మదాబాద్​లోని గుండె ఆసుపత్రిని ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు.


గత ఆరేళ్లలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సౌర విద్యుత్తు రంగంలో భారత్​ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు మోదీ. రోప్​వే ప్రాజెక్టు జాప్యానికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. అడ్డంకులు సృష్టించి ఉండకపోతే.. గతంలోనే అందుబాటులోకి వచ్చేదన్నారు.రైతుల కోసం కిసాన్​ సూర్యోదయ యోజనను ప్రవేశపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: