కర్ణాటక మైసూరు దసరా ఉత్సవాలకు ఎనలేని పేరు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ వేడుకల్లో గజరాజులతో జంబూ సవారీ కీలకఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన గజరాజుతోపాటు అందంగా ముస్తాబైన మరికొన్ని ఏనుగులు ఈ ఊరేగింపులో పాల్గొంటాయి. ఈ వేడుక సోమవారం నిర్వహించనున్నారు.వందల ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు హాజరయ్యేవారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో సింపుల్​గానే వేడుక చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు.


 ఫలితంగా జంబూ సవారి పరేడ్​ కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 300 మందికే ఆహ్వానం అందింది. అయితే ఈ కార్యక్రమాన్ని చందన టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.జంబూ సవారీ వర్కవుట్​గా పిలిచే తలీమ్​ పూర్తయ్యాక.. సీఎం యడియూరప్ప ఆంజనేయస్వామి ఆలయంలోని బలరామ గేటు వద్ద దాదాపు 20 నిమిషాల పాటు జెండాకు పూజ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.40 నుంచి 4.15 వరకు వేడుక జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: