న్యాయ ప్రక్రియను నిరోధిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ పర్యటించేందుకు సిద్ధమని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యాచార బాధితులను పరామర్శించేందుకు రాహుల్ ఎందుకు వెళ్లడం లేదని బిజేపి నేతలు చేసిన విమర్శలకు ఈ మేరకు స్పందించారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అత్యాచార ఘటనల్లో తమ ప్రభుత్వాలు న్యాయాన్ని అడ్డుకోలేదని అన్నారు.


పంజాబ్, రాజస్థాన్​లలో అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదని రాహుల్​ లక్ష్యంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్ విమర్శలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్ హాథ్రస్​ అత్యాచార బాధితులను రాహుల్, ప్రియాంక గాంధీ పరామర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: