ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజేపి మహిళా అభ్యర్థిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ఎన్నికల సంఘానికి సమాధానమిచ్చారు. ఓటమి భయంతోనే తన వ్యాఖ్యలను బిజేపి వక్రీకరించిందని అందులో పేర్కొన్నారు.అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రచారంలో భాగంగా గ్వాలియర్​లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న కమల్​నాథ్​ బిజేపి మహిళా అభ్యర్థిని ఉద్దేశిస్తూ 'ఐటం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.


దీనిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం కమల్​నాథ్​కు నోటీసులు జారీ చేసింంది.రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన 'ఐటం' వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్.. ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను బిజేపి వక్రీకరించిందని సమాధానమిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: