దేశ శక్తిసామర్థ్యాలు, విస్తీర్ణం పరంగా భారత్​.. చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​) చీఫ్​ మోహన్​ భాగవత్ ఆకాంక్షించారు. చైనా విస్తరణవాద ధోరణి గురించి యావత్​ ప్రపంచానికి తెలుసని అన్నారు.మహారాష్ట్ర నాగ్​పుర్​లోని ఆర్​ఎస్​ఎస్​ ప్రధాన కార్యాలయం మహర్షి వ్యాస ఆడిటోరియంలో జరిగిన.. ఆర్​ఎస్​ఎస్​ వార్షిక విజయదశమి కార్యక్రమంలో పాల్గొన్నారు భాగవత్​. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది కేవలం 50 మంది స్వయంసేవక్​లతోనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా.. చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా భారత్​ మెరుగ్గా సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.


పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఏ ఒక్క ప్రత్యేక మతానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు భాగవత్​. వారి జనాభాను పరిమితం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని.. కొందరు మన ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సీఏఏ ద్వారా ఏ ఒక్క భారతీయ పౌరుడికి అన్యాయం జరగదన్నారు. అయితే.. దీని ద్వారా ఎదురైన సమస్యలను పరిష్కరించే చర్యలు చేపట్టే క్రమంలోనే కరోనా వచ్చి.. అన్ని అంశాలను పక్కకు నెట్టిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: