సాధారణంగా మద్యం అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే క్లారిటీ ఉండదు. వాళ్ళ కళ్ళకు ఎవరు అయినా సరే ఒకరకంగానే కనపడుతూ ఉంటారు. కిక్ ఎక్కితే ఏం చేయాలో కూడా వారికి అర్ధం కాక వేరే వాళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అసలు ఏంటీ ఈ సంఘటన అనేది ఒక్కసారి చూస్తే...

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం లోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెం శివారులో మద్యం షాపు వద్ద మందు బాబు వీరంగం సృష్టించాడు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్నారని ప్రశ్నించినందుకు  పోలీసులపై దాడికి ప్రయత్నం చేసాడు. దీనితో పోలీసులు అక్కడ ఉన్న వారి మీద కూడా కేసు నమోదు చేయడమే కాకుండా వారిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: