బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఎల్జెపి అధినేత చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎల్జెపి అధికారంలోకి వస్తే '7 నిస్చే' (స్కీమ్) లోని అవినీతిపై దర్యాప్తు జరుగుతుంది అని ఆయన స్పష్టం చేసారు. తప్పు చేసిన వారు సిఎం లేదా ఏ అధికారి అయినా జైలుకు పంపిస్తామని ఆయన సవాల్ చేసారు. చిరాగ్ పాస్వాన్ డుమ్రాన్ లో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు.

వారు దోషులు అయితే, దర్యాప్తు తర్వాత వారిని జైలుకు పంపిస్తామని ఆయన స్పష్టం చేసారు. పెద్ద ఎత్తున జరుగుతున్న మోసాలు అవినీతి గురించి సిఎంకు తెలియకపోవడం ఎలా సాధ్యమవుతుంది?  అని, ఆయన కూడా అవినీతి చేసాడు అని ఇది విచారణలో స్పష్టంగా వెల్లడి అవుతుంది అని ఆయన అన్నారు.  అతని అవినీతి పరుడు అనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నా అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: