భారత్ లో కరోన కేసులు భారీగా తగ్గాయి. 45,149 మంది గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఇంత తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తం కేసులు 79,09,960 కు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 480 కొత్త మరణాలతో మొత్తం మరణాలు 1,19,014 కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో భారీగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

6,53,717 యాక్టివ్ కేసులు మాత్రమే మన దేశంలో ఉన్నాయి. మొత్తం నయమైన కేసులు 71,37,229గా ఉన్నాయని కేంద్రం ప్రకటన చేసింది. గత 24 గంటల్లో 59,105 మంది డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 25 వరకు కరోనా వైరస్ కోసం  గానూ మొత్తం 10,34,62,778 నమూనాలను పరీక్షించారు. వీటిలో 9,39,309 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: