ఒక పక్కన మావోలు వరుస ఇబ్బందులు పడుతున్న సమయంలో కీలక మావో నేతలు ఎన్కౌంటర్ కావడం లేదా అరెస్ట్ కావడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర తెలంగాణా సహా మూడు రాష్ట్రాల్లో మావోయిస్ట్ లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా చత్తీస్గడ్ రాష్ట్రంలో కీలక మావో నేతలు లొంగిపోవడం సంచలనంగా మారింది.

32 నక్సల్స్ నిన్న దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ముందు లొంగిపోయారు అని అధికారులు పేర్కొన్నారు. వారిలో నలుగురి మీద భారీగా రివార్డ్ లు కూడా ఉన్నాయి. వారి అందరి మీద కూడా ఇప్పుడు కేసులను ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తుంది. వారి మీద కేసులు చాలానే ఉన్నాయని, ముఖ్యంగా హత్య కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక తెలంగాణాలో మావోలు భారీగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర నుంచి భారీగా తెలంగాణకు మావోలు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: