సైబర్ నేరాల విషయంలో ఎన్ని మోసాలు జరుగుతున్నా సరే ప్రజల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు. అసలు ఏదోక రూపంలో మోసపోతూనే ఉన్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఏదోక  ఆఫర్ నమ్మడం ఆ ఆఫర్ కోసం భారీగా మోసపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక రకం మోసం జరిగింది.

నెల్లూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బాలయపల్లి మండలం, కామకూరు గ్రామంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు పేర నకిలీ జాబ్ కార్డులు సృష్టించి సుమారు 9 లక్షలు నగదు తమ బినామీల ఖాతా లలో జమ చేసుకొని పేదలకి అందాల్సిన నగదును కొంత మంది కాజేశారు. సాక్షాత్తు అధికారులనే మోసం చేసారు. దీనిపై ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: