ద్రవ్యోల్బణం అతిపెద్ద సమస్యగా మారింది అని బీహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. బిజెపి దెబ్బకు ఉల్లిపాయల హారం ధరించే పరిస్థితి వచ్చింది అని ఆయన మండిపడ్డారు. కిలోరూ .100 ను ఉల్లి తాకబోతోంది అని ఆయన మండిపడ్డారు.  నిరుద్యోగం ఉందని... దేశంలో ఆకలి పెరుగుతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న వ్యాపారులు నాశనం అవుతున్నారని... పేదరికం పెరుగుతోందని పేర్కొన్నారు.

జిడిపి పడిపోతోందని... మనం  ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాం అని ఆరోపించారు. ఉల్లిపాయ కిలో రూ .50-60కి చేరుకున్నప్పుడు మాట్లాడిన వారు ఇప్పుడు కిలో 80 కి చేరుకున్నప్పుడు మాట్లాడటం లేదని మండిపడ్డారు. రైతులు నాశనమవుతున్నారన్నారు. నిరుద్యోగులు, బీహార్ పేదలు, విద్య, ఉద్యోగాలు, వైద్య సహాయం కోసం ప్రజలు వలసపోతున్నారని తేజశ్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోపణలు చేసారు. నేటితో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: