ఏపీలో కొంత మంది పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా కొడికొండ చెక్ పోస్ట్ లో పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. ప్రొద్దుటూరుకు చెందిన వారిని బెదిరించి రెండు బంగారు బిస్కెట్ల లను తీసుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు. దీనితో వెంటనే ప్రొద్దుటూరు గోల్డ్ షాప్ యజమాని చిలమత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఓ ఎస్ పి ఓ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్న చిలమత్తూరు పోలీసులు... వారిని విచారిస్తున్నారు. ఈనెల 24న బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా కొడికొండ చెక్ పోస్ట్ లో వాహనాలు తనిఖీ చేసారు. ఓ వాహనంలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు... తనిఖీలు చేసారు. ఇందుకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో బంగారు బిస్కెట్లు డిమాండ్ చేసారు. రెండు బంగారు బిస్కెట్లు తీసుకుని వాహనాన్ని వదిలారు. అక్కడి నుంచి అనేక మలుపులు తిరిగి కేసు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap