డిజిటల్ చెల్లింపుల యాప్ గూగుల్ పే వాడాలి అనుకునే వారికి షాక్ తగిలింది. గూగుల్ పేని ఆపిల్ యాప్ స్టోర్ నుండి రిమూవ్ చేసారు. యాప్ స్టోర్‌ లో గూగుల్ పే కోసం  సెర్చ్ చేస్తే అది కనపడదు. టెక్నికల్ సమస్య కారణంగా తొలగించామని త్వరలోనే యూజర్లు అప్‌డేట్ చేసిన గూగుల్ పే యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోగలరని గూగుల్ తెలిపింది. కొన్ని సమస్యల కారణంగా యాప్ ని రిమూవ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.

ఆగస్టులో, గూగుల్ పే లోపం కారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి రిమూవ్ చేసారు. ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులను అస్సలు ప్రభావితం చేయదు అని గూగుల్ ప్రకటన చేసింది. యాపిల్ వినియోగదారులు పేమెంట్ లోపాలను ఎదుర్కొంటున్నారు అని అందుకే రిమూవ్ చేసామని చెప్పారు.  మా టీం దీన్ని వేగంగా పరిష్కరిస్తుంది అని గూగుల్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: