భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే.. నవంబర్​ 4 నుంచి 6 మధ్య నేపాల్‌లో పర్యటించనున్నారు. రక్షణ, భద్రతా అంశాలపై అక్కడి ఆర్మీ ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. నేపాల్​ రక్షణ మంత్రి ఈశ్వర్​ పోఖ్రెల్​, ఆర్మీ చీఫ్​ పూర్ణ చంద్ర థాపాతోనూ.. నరవాణే భేటీ కానున్నారు.నవంబర్​ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటనలో భారత-నేపాల్​ మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు చర్చలు జరగనున్నాయి. 1950లో ప్రారంభమైన పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. జనరల్​ నరవాణేకు నేపాల్​ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి 'జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ' గౌరవ ర్యాంకును ప్రదానం చేస్తారు.


ఈ కార్యక్రమం కాఠ్మాండులో జరగనుంది. భారత్ కూడా 'జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ' గౌరవ ర్యాంకును నేపాల్ ఆర్మీ చీఫ్‌కు ప్రదానం చేస్తుంది.ఈ మధ్య కాలంలో ఇరుదేశాలకు సరిహద్దులు సహా నూతన మ్యాప్​ విషయంలో వివాదాలు నెలకొన్నాయి. ఇరువురికీ దాదాపు 1800 కి.మీ మేర సరహద్దు ఉంది. వాటిపైనా చర్చలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: