కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రభుత్వం చట్టాలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. పంజాబ్ దారిలోనే కేంద్రం చట్టాలను అడ్డుకొనే విధంగా బిల్లును తీసుకురానుంది. అక్టోబర్ 31న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పేద రైతుల హక్కులను రక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.


పంజాబ్ తరహాలోనే బిల్లులను తీసుకురానున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్ సైతం తెలిపారు. ఇప్పటికే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానించింది.మరోవైపు గహ్లోత్ సర్కార్ చర్యలపై బిజేపి పెదవి విరిచింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తామని రాజస్థాన్ బిజేపి ప్రతినిధి రామ్​లాల్ శర్మ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: