భారత్ ,అమెరికా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 2 + 2 చర్చల్లో మూడవ ఎడిషన్ కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ, రక్షణ కార్యదర్శి మార్క్ టి ఎస్పెర్ సోమవారం న్యూ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజనాథ్ మాట్లాడారు. మన ఆర్థిక వ్యవస్థలు నష్టాలను చవిచూశాయి అని ఆయన అన్నారు. మేము పరిశ్రమలు మరియు సేవల రంగాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మనం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ల దృష్ట్యా మన భాగస్వామ్యం మరింత ముఖ్యమైనదని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక జై శంకర్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా, మన ద్వైపాక్షిక సంబంధం క్రమంగా పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా మన బంధం ఎంతో కీలకం అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: