దుబ్బాక నోట్ల కట్టల  వ్యవహారానికి సంబంధించి పోలీసులు వీడియోలు విడుదల చేసారు. అంజన్ రావు నివాసంలో నిన్న దొరికిన డబ్బులకు సంబంధించి వీడియోలను విడుదల చేసారు పోలీసులు.  ఈ వీడియోలలో డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో తనకు తెలియదని అంజన్ రావు భార్య పేర్కొన్నారు. తమకు ఏ వ్యాపారాలు లేవు అని ఆమె అన్నారు.  ఈ డబ్బులు మావే అని ఆమె అన్నారు.

ఇక సీపీ డేవిస్ మాట్లాడుతూ డబ్బులు బయటకు తెచ్చే క్రమంలో కొంత మంది కార్యకర్తలు లాక్కున్నారు అని ఆయన చెప్పారు. ఇక్కడ పరిస్థితి బాగోలేదని బండి సంజయ్ కి చెప్పామని లా అండ్ ఆర్డర్ గురించే ఆయనను తిప్పి పంపించాం అన్నారు. 250 మంది పోలీసులను కూడా అడ్డుకున్నారు అని సీపీ పేర్కొన్నారు. పోలీసులు డబ్బులు ఎక్కడివి అని అడగగా అంజన్ రావు భార్య పై విధంగా సమాధానం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: