ఆస్ట్రేలియా పర్యటన కోసం టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ స్క్వాడ్‌లను బోర్డ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) సోమవారం ప్రకటించింది. గాయపడిన రోహిత్ శర్మను ఈ పర్యటన నుంచి పక్కన పెట్టారు. దీనిపై ఇప్పుడు మాజీ ఆటగాళ్ళు మండిపడుతున్నారు. "డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రూల్స్" అని టీం ఇండియా సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ అన్నాడు.

ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంతో అతను మండిపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ ఐపిఎల్ 2020 లో 11 మ్యాచుల్లో 283 పరుగులు చేశాడు అని చెప్పాడు. సూర్యకుమార్ రికార్డులను చూడాలని హర్భజన్ టీమ్ ఇండియా సెలెక్టర్లను అభ్యర్థించాడు. జట్టు ఎంపిక విషయానికి వస్తే వేర్వేరు వ్యక్తుల కోసం వేర్వేరు నియమాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఐపిఎల్ లో 31.44 సగటుతో 283 పరుగులు చేసి 148.94 స్ట్రైక్ రేట్ సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: