దేశ వ్యాప్తంగా అవినీతి విషయంలో  ఇప్పుడు కేంద్ర సర్కార్ ఫోకస్ చేసింది. అవినీతి ఎవరు చేసిన సహించేది లేదని అంటుంది. దేశ వ్యాప్తంగా 42 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి అని ఐటి అధికారులు పేర్కొన్నారు. 2.37 కోట్ల న‌గ‌దు ఐటి శాఖ అధికారులు గుర్తించారు. ఎంట్రీ ఆప‌రేట‌ర్ సంజ‌య్ జైన్‌, అత‌ని ల‌బ్ధిదారుల ఇండ్ల‌ల్లో ఆదాయ‌ ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఢిల్లీ, ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, హ‌ర్యానా, పంజాబ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఉన్న ఇండ్లు, కార్యాల‌యాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సుమారు 42 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది. ఈ దాడుల్లో అధికారులు సుమారు 2.37 కోట్ల న‌గ‌దు, 2.89 కోట్ల విలువైన బంగారం  గుర్తించారు. ఇంకా అంతర్గతంగా ఐటి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: