గత 24 గంటల్లో ఐదు రాష్ట్రాలు... కేంద్రపాలిత ప్రాంతాలలో (మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్‌గర్ మరియు కర్ణాటక) 58% కొత్త మరణాలు సంభవించాయని... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వివరించారు.  పండుగ కాలంలో, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు  ఢిల్లీ లో కేసులు పెరిగాయన్నారు. 10 రాష్ట్రాలు మరియు యుటిలలో 78 శాతం క్రియాశీల కేసులు ఉన్నాయని ఆయన మీడియాతో మాట్లాడుతూ  తెలిపారు.

 కరోనా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. రికవరీ రేటు ఇప్పుడు దేశంలో 90.62% వద్ద ఉందని ఆయన అన్నారు.  ఇది నిరంతరం పెరుగుతోందని... ఇది మంచి సంకేతం అన్నారు. గత ఐదు వారాలుగా సగటున రోజువారీ కొత్త మరణాలలో నిరంతర క్షీణత ఉంది అని ఆయన మీడియాకు తెలిపారు. కాగా నేడు దేశంలో కాస్త కేసులు తగ్గాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: