హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ను కలసిన‌ బీజేపీ నేతలు నిన్న జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేసారు. సిద్ధిపేట్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఎన్నికల ప్రధానాధికారిని బిజెపి బృందం  కోరింది. ఈ సందర్భంగా బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర బలగాలతో మాత్రమే దుబ్బాక ఉప ఎన్నికలు జరపాలని కోరాం అన్నారు.

ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా ఎన్నికల పరిశీలకుడిని నియమించాల్సిందిగా విజ్ఞప్తి చేశాం అని ఆయన తెలిపారు. ఎస్పీ, పోలీస్ అధికారి జోయల్ ను సప్పెండ్ చేయాలి అన్నారు. గత ప్రభుత్వం తలుచుకుంటే 2001 ఉప ఎన్నికలో కేసీఆర్  గెలిచేవాడా? అని నిలదీసారు. స్థానిక పోలీస్ అధికారులపై మాకు నమ్మకం లేదు అన్నారు. బీజేపీ నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్ళాం అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: