భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లోని 18 మందిని కరడు గట్టిన ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. వీరిలో ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహచరులు, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఛోటా షకీల్, టైగర్ మెమన్ తదితరులున్నారు. అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ( చట్ట వ్యతిరేక కార్యకలాపాల  నిరోధక చట్టం) కింద వీరిని ‘డె జిగ్నేటెడ్ టెర్రరిస్టులు’ గా ప్రకటించారు.

ఇంకా హిజ్ బుల్ ముజాహిదీన్ ఫౌండర్ సయ్యద్ సలావుద్దీన్, లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్, జావేద్ చినా వంటివారిని కూడా ఈ లిస్టులో చేర్చారు. భారత్ ప్రకటించిన ఈ నిర్ణయంతో పాకిస్తాన్ జిహాదీలు గా చెప్పుకునే వారిపై ఉక్కుపాదం మోపినట్లయింది. 1993 లో ముంబై వరుస పేలుళ్లకు సూత్రధారులైనవారినందరిని   ప్రధాన ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. భారత్ ఇలా ప్రకటించడం వల్ల వీరి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, అంతర్జాతీయ వేదికల్లో ఉగ్రవాదంపై మరింత ఉధృతంగా పోరాటం జరపడానికి ఇండియాకు మార్గం సుగమమవుతుంది. ఇండియా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

ఎందుకంటే అంతర్జాతీయ దేశాల మధ్యన దోషిగా నిలబెట్టే అవకాశం ఉన్నందువల్ల పాకిస్తాన్ ను పూర్తిస్థాయిలో టెర్రరిస్టుల దేశంగా నిలబెట్టే అవకాశం ఉన్నందువల్ల పాకిస్తాన్ ఒంటరి దేశం కావడం ఖాయం. పాకిస్తాన్ ఒంటరి గా మిగిలిపోవడం వల్ల ఆ దేశ అభివృద్ధి పూర్తిస్థాయిలో వెనుకబడి పోతుంది. ఇప్పటికే పలు దేశాల్లో పాకిస్తాన్ పైన మండిపడుతున్నాయి ఇప్పుడు భారత్ ప్రకటించిన ఈ నిర్ణయంతో వివిధ దేశాలు భారత్ నిర్ణయానికి అండగా నిలబడడం కాయం. కాబట్టి భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ ఎలా స్పందించినా భారత్ తీసుకున్న నిర్ణయానికి అన్ని దేశాలు ఏకీభవించడం కాయం గా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: