సన్​రైజర్స్​ హైదరాబాద్​ అదరగొట్టింది. దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ను చిత్తుగా ఓడించి 88 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ.. 19 ఓవర్లకే 131 పరుగులు చేసి ఆల్​ఔట్​ అయ్యింది. విజయంలో వృద్ధిమాన్‌ సాహా (87; 45 బంతుల్లో, 12×4, 2×6), డేవిడ్‌ వార్నర్‌ (66; 34 బంతుల్లో, 8×4, 2×6), మనీష్ పాండే(44) కీలక పాత్ర పోషించారు.


రెండో ఇన్నింగ్స్​ చేసిన ఢిల్లీలో రిషభ్​ పంత్​(36) టాప్​ స్కోరర్​. రహానే(26) నామమాత్రంగా ఆడాడు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. సన్​రైజర్స్​ బౌలర్లలో రషీద్​ ఖాన్​(3), సందీప్​ శర్మ(2), నటరాజన్​(2), హోల్డ్​ర్​, విజయ్​ శంకర్​, షబాజ్​ నదీమ్​ తలో వికెట్​ తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: