భారత్‌, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. భారత్, అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరుగుతున్న టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బెకా ఒప్పందం.. కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్‌లతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బేసిక్ ఎక్ఛేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్‌పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.


గత 2 దశాబ్దాలుగా భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడం చాలా ముఖ్యమని, దీనికి భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: