అత్యాచారాలు నేరాల విషయంలో పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే కొందరిలో మార్పు రావడం లేదు. కాల్చి చంపేస్తున్నా సరే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది.  కఠిన చట్టాలు అమలు చేస్తున్నా సరే మార్పు మాత్రం కొందరిలో అసలు కనపడటం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది.

మూడేళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అడపా వీర బ్రహ్మం (45)అనే వ్యక్తిని అక్కడి స్థానికులు గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరిక్షలు నిర్వహించారు.  చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతనిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ బాధితురాలిని స్థానిక నాయకులు అందరూ పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: