తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్య పరిస్థితి లేకుండా  టీటీడీ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు అధికారులు. నవంబర్ 1 వ తేదీ నుంచి కల్యాణోత్సవ సేవ టిక్కెట్ల కోటాను పెంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం  నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వున్న 1000 టిక్కెట్ల సంఖ్యను 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు.

ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను 500 చొప్పున ఆన్ లైన్ లో భక్తులకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ మూడు సేవల్లో పాల్గొనే భక్తులు స్వామి వారి దర్శనంకు వెళ్లాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను కొనుగోలు చెయ్యాలని నిబంధనను టీటీడీ విధించడం గమనార్హం. ప్రస్తుతం తిరుమలలో రోజుకి 14 వేల మందికి పైగా దర్శించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: