భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది. మొదటి రెండు వన్డేలు సిడ్నీ క్రికెట్ మైదానంలో (నవంబర్ 27, 29), మూడవది కాన్బెర్రాలోని మనుకా ఓవల్ (డిసెంబర్ 2) లో జరుగుతుంది. ఆ తర్వాత ఇరు జట్లు కాన్బెర్రా (డిసెంబర్ 4), సిడ్నీ (6,8 డిసెంబర్) లో జరిగే మూడు మ్యాచ్‌ల టి 20 సిరీస్‌ లో పోటీపడతాయి. ఐసిసి పురుషుల టి 20 ఐ టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ఉంది.

గత పది టీ 20 ల్లో ఆస్ట్రేలియాపై 5-4 తేడాతో భారత్ విజయం సాధించింది. వన్డేలు, టి 20 లు పూర్తయిన తరువాత, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రారంభిస్తారు. ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ లో ఈ సీరీస్ జరుగుతుంది. మొదటి టెస్ట్ డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్ ఓవల్‌ లో జరిగే  డే అండ్ నైట్ టెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: