ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ ప్రారంభం అయింది. బీజేపీ నుంచి హాజరైన పాక సత్యనారాయణ తన అభిప్రాయం చెప్పారు. ఒక్కో పార్టీకి 10 నిమిషాలు సమయం విడి విడిగా కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి తమ అభిప్రాయాన్ని బీఎస్పీ, బీజేపీ ప్రతినిధులు చెప్పారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీకి బీఎస్పీ, బీజేపీల సూచనలు చేసాయి.

అధికార దుర్వినియోగానికి పాల్పడి గతంలో ఏకగ్రీవాలు జరిగాయని అభిప్రాయపడ్డ బీఎస్పీ, బీజేపీ... వాటిని రద్దు చేయాలని కోరాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ, బీఎస్పీ పేర్కొన్నాయి. అంతే కాకుండా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో ఏకపక్షంగా గతంలో ఎన్నికల కమీషన్ వ్యవహరించింది అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈసారి అలా జరగకుండా చూడాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp