మహబూబాబాద్ లో కిడ్నాప్ కి గురైన బాలుడు  దీక్షిత్ రెడ్డి తండ్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల  18 సాయంత్రం కిడ్నాప్ చేసి, వెంటనే హత్య చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు అని... అయినా దీక్షిత్ ఆచూకి లభించలేదు అన్నారు. మీడియా, ప్రజలు బాగా కష్ట పడ్డారు. దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారని ఆయన చెప్పారు.

నిందితుడు మంద సాగర్ ను మరోసారి విచారించి, వెంటనే శిక్షించాలి. పోలీసులు మా కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది అన్నారు. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ఉదంతాన్ని చూసి హైద్రాబాద్ లో మరో సంఘటన జరిగిందన్నారు. భవిష్యత్ లో ఇది రోల్ మోడల్ గా మారే  అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో తెలంగాణా పోలీసులు అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ దురదృష్టవశాత్తు దీక్షత్ తిరిగిరాలేదు ఇది మా దురదృష్టం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: