తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... టీడీపీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతోందన్నారు. అందుకనే ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నా అని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని అందరూ మెచ్చుకుంటున్నారని ఆమె తెలిపారు. ఇప్పటికే పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసారు టీడీపీ విప్ బుద్దా వెంకన్న. దీనిపై పలుమార్లు విచారణ కూడా జరిగింది. పోతుల సునీతకు మరో రెండున్నరేళ్ల పాటు ఎమ్మెల్సీ పదవి ఉంది. రాజీనామా చేసిన స్థానంలో తిరిగి ఎంపిక చేస్తామని హామీ ఇవ్వటంతోనే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: