తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వారిలో రేవంత్ రెడ్డి ఒకరు టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, ఆ పార్టీ అగ్ర నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అధికార పక్ష నేతలపై ఎన్ని విమర్శలు చేసినా, కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ తిరిగి స్పందించడం చాలా తక్కువ. అయితే తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు టీడీపీలో ఉండి కల్లబొల్లి కబుర్లు చెప్పే రేవంత్ రెడ్డిఇప్పుడు కాంగ్రెస్‌‌లో ఉన్నారని, రేపోమాపో బీజేపీలోకి పోయిన ఆశ్చర్యం లేదని కేటీఆర్ జోస్యం చెప్పారు. తన దృష్టిలో రేవంత్‌రెడ్డి అసలు లీడరే కాదని కొట్టిపారేశారు. కేటీఆర్ ఆర్ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలుచేశారు.రేవంత్ రెడ్డిని ప్రజలు పట్టించుకోవడం మానేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ నేతల్లో చాలామంది త్వరలోనే పార్టీలు మారే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలియజేశారు. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీతో పట్టం కడుతున్నారని తెలిపారు.

 దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ నేతల వ్యాఖ్యలు చాలా అభ్యంతకరంగా ఉన్నాయని వెల్లడించారు. మా ఓపిక నశిస్తే ప్రధాని సహా ఎవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలను కిషన్‌ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని సూచించారు.తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత కేసీఆర్ కి, మా ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందన్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి: