కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సెక్స్ ​వర్కర్లకు ఉచిత రేషన్​ పంపిణీ చేయలని జారీ చేసిన ఉత్తర్వులపై సమ్మతి నివేదికను సమర్పించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ ఎల్.​ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.అయితే ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేయడానికి మరింత సమయం కావాలని కోరింది. దీనికి నాలుగు వారాల సమయం సరిపోతుందని కోర్టు తెలిపింది. రేషన్​ పంపిణీ పథకం అమలు చేయకపోతే.. అది రాష్ట్రాల అసమర్థతను సూచిస్తుందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.


మహారాష్ట్రలోని 8 జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలను సమీక్షించిన ధర్మాసనం... వాటిలో సారుప్యత లేదని పేర్కొంది. ఈ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని... ఈ మేరకు రెండు వారాల్లో సమ్మతి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది ఉన్నతన్యాయస్థానం.అసోంలో ఎన్​ఏసీఓ(నాకో) ద్వారా సెక్స్​ వర్కర్లను గుర్తించామని.. అయితే రేషన్​ పంపిణీ గురించి ఎటువంటి సమాచారం లేదని అడ్వకేట్​ ప్రశాంత్​ భూషణ్​ తెలిపారు. ఈ పథకంలో కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: