ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్​ చేస్తోంది. ఓ కేసులో రావత్​పై అవినీతి ఆరోపణలతో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్​ డిమాండ్ చేస్తోంది.రాష్ట్రంలో అవినీతిని నిరోధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు. ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీఎం పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హతలేదు' అని కాంగ్రెస్  అధ్యక్షుడు ప్రీతమ్​ సింగ్​ ధ్వజమెత్తారు.


రాష్ట్ర గవర్నర్​ బేబి రాణి మౌర్యను కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామని ప్రీతమ్​ సింగ్​ అన్నారు.హైకోర్డు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలంటే రావత్​ వెంటనే పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్​ నేతలు కోరారు. మరోవైుపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర బిజేపి నేతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: