ఈ రోజు జరగాల్సిన ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆపమని ఎంసెట్ నిర్వహిస్తోన్న జేఎన్టీయూని హైకోర్టు ఆదేశించింది. దానికి  కారణం కూడా లేకపోలేదు. ఈ ఏడాది కరోనా కారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయకుండానే ఆ విద్యార్థులను కనీస మార్కులు అంటే 35 వేసేసి పాస్ చేసింది ప్రభుత్వం. అయితే ఎంసెట్ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ లో 45 శాతం ఉన్నవారికే ఎంసెట్ రాసే అర్హత ఉంటుంది. ఈ లెక్క పెద్ద ఎత్తున విద్యార్థులు ఎంసెట్ రాసేందుకు అర్హత కోల్పోయారు.
                                                      ఈ విధంగా అర్హత కోల్పోయిన విద్యార్థులు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోవిడ్ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయిన మాట వాస్తవమేనని ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అలానే ఒకటి రెండు రోజుల్లో ఎంసెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఒక జీవో కూడా జారీ చేస్తుందని ఆయన కోర్ట్ కు తెలిపారు. ఈ క్రమంలోనే ఈరోజు నుండి జరగాల్సిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రభుత్వ ఉత్తరువులు ఇచ్చేవరకు ఆపాలని జేఎన్టీయూని హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: