తెలంగాణా సీఎం కేసీఆర్, అలానే అధికార పార్టీ కొత్త సచివాలయం అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలియని విషయం కాదు. పట్టిన పట్టు వీడకుండా పాత సచివాలయాన్ని కూల్చి వేసిన ప్రభుత్వం ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణానికి సిద్దం అయింది. అయితే ఈ నిర్మాణానికి నిన్న టెండర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ టెండర్స్ టెండర్ ఖరారు చేసింది. ఎల్ 1 గా షాపూర్జీ-పల్లొంజీ గ్రూప్ రావడంతో అదే సంస్థ టెండర్ దక్కించుకుంది.

 బిడ్లలో ఎల్ 1 గా నిలిచి నిర్మాణం పనుల టెండర్ ను చేజిక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ-పల్లొంజీతో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ కుదరనుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం 12 నెలలలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలనే నిబంధన పెట్టనుంది ప్రభుత్వం. ఇక త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే చివరి వరకు బరిలో నిలిచిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి మాత్రం నిరాశ తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: