భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయని అనుకునే లోపే మళ్ళీ పెరుగుతున్నాయి. మొన్న కేవలం 36 వేల లోపే ఇండియాలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు నిన్న 43 వేలు దాకా చేరగా ఈరోజు మళ్ళీ పెరిగి 49 వేల దాకా నమోదయ్యాయి. తాజాగా హెల్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో మన దేశంలో 49,881 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మన దేశంలో మొత్తం కేసులు 80,40,203కు పెరిగాయి. 517 కొత్త మరణాలతో, మరణాల సంఖ్య  1,20,527కు చేరుకుంది.

గత 24 గంటల్లో కరోనా నుంచి 56,480 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు  6,03,687గా ఉన్నాయి.  ఇప్పటి వరకు మొత్తం కరోనా తగ్గిన కేసులు  73,15,989గా ఉన్నాయి.  అక్టోబర్ 28 వరకు మొత్తం 10,65,63,440 నమూనాలను పరీక్షించారు. వీటిలో 10,75,760 నమూనాలను నిన్న పరీక్షించారు అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)  పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: