కరోనా సమయంలో వైద్యులు, మెడికల్ వర్కర్ లతో పాటు పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో వారు అంతా రోడ్ల మీదనే ఉండి బయటకు ఎవరూ రాకుండా చూసి కొంత మేర వైరస్ స్ప్రెడ్ కాకుండా కాపాడారు. ఈ నేపథ్యంలో వారు చేసిన ప్రజాసేవకు రాష్ట్ర పోలీసులు స్పందించిన తీరుకు గాను డీజీపీ మహేందర్‌రెడ్డి స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహారించడం,

 వలస కార్మికుల తరలింపులో అనేక సేవలు అందించడం తదితర అంశాలను పరిశీలించిన స్కోచ్ సంస్థ తెలంగాణా పోలీసులని బంగారు మెడల్ కి ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్ర పోలీసుల తరుపున వర్చువల్ సమావేశంలో సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి బంగారు స్కోచ్‌ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ‘కొవిడ్‌ విధుల్లో అంకితభావంతో నిరంతరం శ్రమించిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది అందరికీ అభినందనలు’ అంటూ డీజీపీ ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: