తెలంగాణా ప్రజలకు ధరణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మేడ్చల్ జిల్లాలో పోర్టల్ ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం కానున్నాయి. సమీకృత భూరికార్డుల యాజమాన్యం విధానం ధరణిని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. భూరికార్డులు అన్నిటినీ ఆన్లైన్లోకి మారుస్తోంది. భూ పరిపాలన రిజిస్ట్రేషన్ సేవల నిర్వహణ రెండింటినీ అనుసంధానం చేసే అధునాతన భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థని రూపొందిస్తోంది.

ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ ధరణి సేవలు ప్రారంభించనున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి సాగు భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్న కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఈ ధరణి పోర్టల్ మీద రెవెన్యూ అధికరులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: