ఆంధ్రప్రదేశ్ లో సాగునీరు విషయంలో సర్కార్ చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ సర్కార్ కి మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులు తరుచుగా వస్తూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ సర్కార్ కి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సైబల్ దాసు గుప్త లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

 రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు అవసరమని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టవద్దు అని ఆదేశాలు జారీ చేసారు. డిటైల్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్) తదితర అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం... గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటీషన్ పై ఎన్.జి.టి ఈ తీర్పు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: