ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీలో నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం నెలకొంది. ఇప్పటికే ఇక్కడ వైసీపీలో రెండు మూడు గ్రూప్ లు ఉన్నాయి. అందులో ఒక వర్గం కరణం బలరామ్ ది కాగా మరో వర్గం  వైసీపీ ఇన్ ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యది. ఈ క్రమంలో అద్దంకిలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. చీరాల ఎమ్మెల్యే  కరణం బలరామ్, అద్దంకి వైసీపీ ఇన్ ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అనుచరులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామ్,  కరణం వెంకటేష్ ఫ్లెక్సీలని వారి అనుచరులు ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా అద్దంకి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కృష్ణ చైతన్య అనుచరులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు ఏమో కరణం బలరామ్ ఫ్లెక్సీలకి అనుమతి లేదంటూ వాటిని తొలగించారు. దీంతో బలరామ్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఘర్షణలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పరస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: