బీహార్ లో ఒకప్పుడు జంగిల్ రాజ్యం ఉండేది అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలను బీహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్ తిప్పి కొట్టారు. అవినీతి, ఉద్యోగాలు మరియు వలస సంక్షోభం వంటి నిజమైన సమస్యలను దాటవేస్తున్నారని ఆరోపించారు. "ఆయన దేశ ప్రధాని, అతను ఏదైనా చెప్పగలరు, నాకు దానిపై స్పందించడం ఇష్టం లేదు. కాని ఆయన బీహార్ వచ్చారు, ఆయన ఒక ప్రత్యేక ప్యాకేజీ, నిరుద్యోగం, మరింత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడవచ్చు" అని తేజశ్వి యాదవ్ విలేకరులతో అన్నారు.

"ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ (బిజెపి), వారు 30 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు... వారి ప్రధాని ఇలా మాట్లాడితే ప్రజలకు ప్రతిదీ తెలుసని” అన్నారు. “అయితే ఆయన పేదరికం, కర్మాగారాలు, రైతులు, నిరుద్యోగం ... వంటి అంశాలపై మాట్లాడాలి." అని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: