గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరల విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ భారీగా పెంచడం దానికి తోడు నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ మద్యం ధరల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో మద్యం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మద్యం ప్రియులకు శుభవార్త చెప్పారు.

భారత్‌ లో తయారయ్యే విదేశీ మద్యం, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించి ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 50 నుంచి రూ. 1350 వరకు వివిధ కేటగిరీలల్లో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ధరలు అక్టోబరు 30 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. దీనిపై ఏపీలో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: